బ్యాచిలర్స్ జర భద్రం: పెళ్లి కాని మగవాళ్లకు కరోనా డెత్ రిస్క్ ఎక్కువట

బ్యాచిలర్స్ జర భద్రం: పెళ్లి కాని మగవాళ్లకు కరోనా డెత్ రిస్క్ ఎక్కువట

న్యూఢిల్లీ: ఒంటరిగా ఉండే పురుషులు లేదా పెళ్లి కాని మగవాళ్లకు కరో్నాతో చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువని తాజాగా ఓ స్డడీలో తేలింది. తక్కువ ఆదాయం కలిగి, పెద్దగా చదువుకోని, అల్పాదాయ దేశాల్లో పుట్టిన పురుషులకు కరోనాతో చనిపోయే రిస్క్ ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణాలన్నీ కరోనాతో మరణించే అవకాశాలు పెరగడానికి సంబంధం కలిగినవని స్వీడన్‌‌లోని స్టాక్‌‌హోమ్ యూనివర్సిటీ ఆథర్ స్వెన్ డ్రాఫల్ చెప్పారు. స్వీడన్‌‌లో కరోనాతో చనిపోయిన మృతుల్లో 20 ఏళ్లకు పైబడిన వ్యక్తుల మరణాల డేటాను పరిశీలించిన అనంతరం స్వీడిష్ నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఈ రిపోర్టును తయారు చేసింది.

తాజా రిపోర్ట్ ప్రకారం స్వీడన్‌‌లో జన్మించిన వారి కంటే విదేశాల్లో పుట్టిన వారికి కరోనాతో చనిపోయే రిస్క్ తక్కువగా ఉంటుందని డ్రాఫల్ తెలిపారు. ఈ రీసెర్చ్‌‌లో భాగంగా ముఖ్యంగా ఆదాయం, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. కరోనా డెత్ రిస్క్‌‌లో మహిళలతో పోల్చుకుంటే చనిపోయే ప్రమాదం పురుషులకు రెట్టింపు అని ఈ రిపోర్టు వెల్లడించింది. ‘తక్కువగా చదువుకున్న వారు లేదా అల్పాదాయం కలిగిన మగవాళ్లకు చనిపోయే రిస్క్ ఎక్కువే. ఎందుకంటే వారి జీవనశైలి, ఆర్థిక సమస్యలే ఇందుకు కారణం. వాళ్లు తమ హెల్త్ కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించగలరు?’ అని స్టడీ ఆథర్ గున్నార్ అండర్సన్ పేర్కొన్నారు.