kartika masam 2023: కార్తీక మాసంలో పెళ్లి కాని వారు చేసే పూజలు ఇవే...

kartika masam 2023: కార్తీక మాసంలో పెళ్లి కాని వారు చేసే పూజలు ఇవే...

kartika masam 2023:హిందూ మతంలో కార్తీక మాసం శ్రీమహావిష్ణువు పూజకు అంకితం చేయబడిందని పురాణాల్లో ఉంది. ఈ మాసంలో విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  కార్తీక మాసం పూజలు, వ్రతాల మాసంగా కూడా పరిగణించబడుతుంది.   ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 14న ప్రారంభమవుతుంది.  కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి వివాహం కూడా ఈ మాసంలోనే జరిగిందని చెప్తారు. అందుకే ఈ కార్తీక మాసంలో తులసిమాతకు కొన్ని పరిహారాలు చేస్తే పెళ్లిళ్లు తొందరగా అవుతాయని నమ్మకం కూడా ఉంది.

మీ వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు వస్తే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వైవాహిక సమస్యలతో సతమతమవుతున్నవారు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత తులసికోటకు నీటిని సమర్పించండి. ఈ పరిహారాన్ని చేస్తే వివాహంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

కార్తీక మాసంలో తులసిమాత, శాలిగ్రామం వివాహం చేసుకున్నారని  ఆధ్యాత్మిక గ్రంధాల్లో రుషిపుంగవులు పేర్కొన్నారు. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఏకాదశి నాడు తులసి కళ్యాణం  ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు తగిన వరుడు దొరుకుతాడని నమ్ముతారు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి లేదా ఏకాదశి నాడు తులసి మాతకు ఎర్రచందనం సమర్పించాలని పండితులు చెబుతున్నారు. హిందూమతంలో ఎర్ర చందనాన్ని సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే  ఈ పరిహారాన్ని చేసే వారికి  పెళ్లి త్వరలోనే అవుతుందంటున్నారు పండితులు. అంతేకాదు ఈ పరిహారంతో వైవాహిక జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.