స్పెషలిస్ట్ల పేరు మీద.. ఆర్ఎంపీల ట్రీట్మెంట్

స్పెషలిస్ట్ల పేరు మీద.. ఆర్ఎంపీల ట్రీట్మెంట్
  • పేరుకు పెద్ద హాస్పిటల్స్​..
  •  ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు 
  • జిల్లాలో కొనసాగుతున్న హెల్త్ టీమ్స్ తనిఖీలు
  • చాలా హాస్పిటల్స్​లోరిజిస్టర్డ్ డాక్టర్లే లేరు
  • జిల్లాలో 288 హాస్పిటల్స్, 57 డయాగ్నిస్టిక్ సెంటర్లు

యాదాద్రి, వెలుగు :  పేరుకు పెద్ద హాస్పిటల్స్.. రిజిస్టర్డ్ ఎంబీబీఎస్​డాక్టర్లు మాత్రం లేరు. అక్కడ ట్రీట్​మెంట్​ చేసేదీ ఆర్ఎంపీలే. బయో మెడికల్​ వేస్ట్​ మేనేజ్​మెంట్​ కన్పించడం లేదు. అసలు డాక్టర్లు లేకున్నా హాస్పిటల్స్​ నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్సే ఎక్కువగా ఉన్నాయి.  యాదాద్రి జిల్లాలో ఇటీవల అబార్షన్లు, బాలింత, శిశువుల మృతి కేసులు వెలుగు చూశాయి. ఎంబీబీఎస్​ పాస్ కాని వాళ్లు అబార్షన్లు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో జిల్లాలోని అన్ని హాస్పిటల్స్​ను తనిఖీ చేయడానికి ఆరు టీమ్స్​ను కలెక్టర్​ హనుమంతరావు ఏర్పాటు చేశారు.

 ప్రోగ్రామ్​ఆఫీసర్ల నేతృత్వంలోని ఈ ఆరు టీమ్స్ జిల్లాలోని 288 రిజిస్ట్రర్డ్​హాస్పిటల్స్, 57 డయాగ్నిస్టిక్​ సెంటర్లను తనిఖీ చేస్తున్నాయి. ఇప్పటివరకు సగానికి పైగా హాస్పిటల్స్​ను ఈ టీమ్స్​తనిఖీ చేశాయి. హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్, రిజిస్ట్రర్డ్​డాక్టర్లు ఉన్నారా..? బయో మెడికల్​వేస్ట్​మేనేజ్​మెంట్​నిర్వహిస్తున్నాయా..? హాస్పిటల్స్​పేషెంట్లకు కనీస వసతులు కల్పిస్తున్నారా..? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. 

పాత రిజిస్ట్రేషన్లే.. రికార్ట్ మెయింటనేన్స్​లేదు..

ఇప్పటివరకు తనిఖీ చేసిన హాస్పిటల్స్​కు గతంలో చేసిన రిజిస్ట్రేషన్లే ఉన్నాయి. అయితే  హాస్పిటల్స్​ను నియంత్రించడానికి 2010లో యూపీఏ సర్కారు 'క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్​యాక్ట్​-2010' తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్​హాస్పిటల్స్​లో పని చేసేవారు కచ్చితంగా మెడికల్​కౌన్సిల్, పారా మెడికల్​బోర్డు, నర్సింగ్​కౌన్సిల్​లో రిజిస్ట్రేషన్​ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2022 జూన్​ 14న జీవో నంబర్​64కు అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే హెల్త్​టీమ్స్​చేస్తున్న ఈ తనిఖీల్లో చాలా హాస్పిటల్స్​ ఇంకా పాత రిజిస్ట్రేషన్లతోనే కొనసాగుతున్నాయని తేలింది. పైగా రికార్డుల మెయింటెనెన్స్ లేకపోవడంతో వచ్చిన పేషెంట్లు, ట్రీట్​మెంట్​ చేసిన వివరాలు ఏవీ లేవు. బయో మెడికల్ వేస్ట్​మేనేజ్​మెంట్​అమలు చేయడం లేదు. 

ఎంబీబీఎస్​లు లేరు.. ఆర్ఎంపీలే.

హెల్త్​ టీమ్స్​తనిఖీలు నిర్వహించిన కొన్ని హాస్పిటల్స్​లో గత రిజిస్ట్రేషన్ ప్రకారం నమోదైన ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. ఆ కుర్చీల్లో ఆర్ఎంపీలు కూర్చొని ట్రీట్​మెంట్ చేస్తున్నారు. ఆ హాస్పిటల్​లో రిజిస్టర్ అయిన డాక్టర్లకు హెల్త్​టీమ్స్ ఫోన్​ చేస్తే కొందరి నుంచి రిప్లయ్ లేదు. మరికొందరు తాము ఆ హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్ చేయడం లేదని చెప్పుకొచ్చారు. కొందరైతే ఫంక్షన్లకు వెళ్లామంటూ సాకులు చెబుతున్నారు. భూదాన్​ పోచంపల్లిలోని ఓ హాస్పిటల్​కు రిజిస్ట్రేషన్ ఉంది.. హాస్పిటల్ తెరిచే ఉన్నా డాక్టర్లు మాత్రం లేరు. దీంతో హాస్పిటల్​మూసి వేయాలని మేనేజ్​మెంట్​కు హెల్త్​టీమ్ సూచించింది. 

డయాగ్నిస్టిక్ సెంటర్లలోనూ ఎక్కడా రికార్డ్​మెయింటేన్స్ చేయడం లేదని గుర్తించారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి స్కానింగ్ తీశారో తెలియకుండా ఉంది. దీంతో రికార్డులు కచ్చితంగా మెయింటేన్స్​చేయాలని టీమ్స్ హెచ్చరించాయి. తాము తనిఖీలు నిర్వహించిన హాస్పిటల్స్​లోని లోపాలు, ఆర్​ఎంపీలు ట్రీట్​మెంట్ చేయడం వంటి అంశాలతో హాస్పిటల్ వారీగా రిపోర్ట్ రూపొందించి డీఎంహెచ్​వోకు అందిస్తున్నారు. ఆ రిపోర్టులను కలెక్టర్ పరిశీలించిన అనంతరం.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హాస్పిటల్స్, డయాగ్నిస్టిక్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. వివరణ తర్వాతే హాస్పిటల్స్, డయాగ్నిస్టిక్స్​సెంటర్ కొనసాగింపుపై స్పష్టత వస్తుంది. 

ఒక్క నెలలోనే ఐదు సంఘటనలు..

జిల్లాలో ఒక్క జూలై లోనే ఐదు సంఘటనలు వెలుగు చూశాయి. జిల్లా కేంద్రమైన భువనగిరిలో లింగనిర్ధారణ అనంతరం రెండు అబార్షన్లు ఒకే హాస్పిటల్​లో చేయడంతో పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. మరో హాస్పిటల్​లో అబార్షన్​ జరిగినట్టు ఫిర్యాదు రావడంతో హెల్త్ డిపార్ట్​మెంట్​విచారణ జరిపింది. అయితే 'బాత్రూమ్ వెళ్లినప్పుడు గర్భం నుంచి శిశువు జారిపోయినందున హాస్పిటల్​లో తాము ట్రీట్​మెంట్​జరిపించుకున్నాం' అని విచారణలో యాదగిరిగుట్ట మండలానికి చెందిన దంపతులు తెలపడంతో డిపార్ట్​మెంట్ బాధ్యులు మౌనం వహించారు. మరోవైపు చౌటుప్పల్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో బాలింత మృతి చెందింది. భువనగిరిలోని మరో హాస్పిటల్​లో గర్భిణికి ట్రీట్​మెంట్​ అనంతరం హైదరాబాద్​కు సిఫారసు చేయడం, అక్కడికి వెళ్లే సరికే గర్భంలోనే శిశువు మృతి చెందిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.