Unstoppable with NBK : లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు రష్మిక ఫోన్‌..

Unstoppable with NBK : లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు రష్మిక ఫోన్‌..

అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ( Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు.

లేటెస్ట్ NBK ఎపిసోడ్లో యానిమల్ టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. రణబీర్ (Ranbir Kapoor), రష్మిక(Rashmika), సందీప్ వంగా(Sandeep Vangaa)..బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో సందడి చేస్తూ మరింత హుషారు పెంచారు. అంతేకాకుండా.. బాలయ్య ఈ ఎపిసోడ్ లో రచ్చ రచ్చ చేశారు. బాలయ్య మాట్లాడుతూ..సాయంత్రం పూట సరదా టైంలో ఏంటి మాములుగా అని సందీప్ను అడగ్గా..ఎప్పుడన్నా..ఓ సారి విస్కీ సార్..ఆ బ్రాండ్ ఆపేసి నా బ్రాండ్కు వచ్చేయ్..తొందరగా కథలు రాయడం స్టార్ట్ చేస్తావు..అంటూ సరదా సన్నివేశంతో షో స్టార్ట్ అయింది.  

ఇందులో టాలీవుడ్‌ యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను గురించి బాలయ్య అడగ్గా..సందీప్‌ వంగా మాట్లాడుతూ..ఆయన ప్రతి యాక్షన్‌ ఎపిసోడ్‌ను గుడిలో ప్లాన్‌ చేస్తారన్నారు. అలాగే బాలకృష్ణ ఫేమస్‌ డైలాగు ‘ఫ్లూటు జింక ముందు ఊదు..’ను హీరో రణ్‌బీర్‌ కపూర్‌ చెప్పి ఆడియన్స్ను అలరించారు.

అలాగే రష్మిక (Rashmika) లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు ఫోన్‌ చేశారు. అంతకు ముందు..అర్జున్ రెడ్డి, యానిమల్ పోస్టర్స్ స్క్రీన్ పై వేయగా..ఎవరంటే ఇష్టం అని రష్మికను అడగ్గానే..సిగ్గుతో..చిరునవ్వుతో మెలికలు తిరిగిపోయింది.

వాట్సా ప్ రే..అని విజయ్ ఫోన్లో అనగానే..రష్మిక మరో లోకంలో తేలాడుతున్నట్టు తన మనసును దాచేసింది.లేటెస్ట్గా విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్‌ నవంబర్ 24న ప్రసారం కానుంది.