అందాల తారలతో అదిరిపోయిన..అన్స్టాపబుల్ కొత్త ప్రోమో

అందాల తారలతో అదిరిపోయిన..అన్స్టాపబుల్ కొత్త ప్రోమో

అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే (Unstoppable with NBK) అంటూ ఓటీటీ ప్లాట్ఫామ్ లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ(Balakrishna). గతంలో తెలుగులో వచ్చిన టాక్ షోలకు భిన్నంగా షోను హోస్ట్ చేస్తూ బాలయ్య..అస్సల్ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు.

ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.లేటెస్ట్గా అన్‍స్టాపబుల్ నెక్స్ట్ఎపిసోడ్ నుంచి ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమోలో హీరోయిన్ శ్రీయ, సుహాసిని, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ సి. పరాన్జీలతో ఉన్న వీడియోను ఆహా రిలీజ్ చేసింది. ఈ కొత్త ఎపిసోడ్ డిసెంబర్ 22న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. 

గెస్ట్స్గా వీరే ఎందుకు వచ్చారంటే..

మంగమ్మగారి మనవడు మూవీలో బాలయ్యకి హీరోయిన్ నటించిన సుహాసిని..మరోసారి ‘దంచవె మెనత్తా కూతురా’ డేస్ని రిపీట్ చేసేందుకు ఈ క్రేజీ అన్‌స్టాపబుల్లో సందడి చేయబోతున్నారు. అలాగే బాలయ్య అల్టిమేట్ రోల్స్లో నటించిన చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యకి జోడిగా కనిపించిన శ్రియా మూడో ఎపిసోడ్లో గెస్టుగా రాబోతున్నారు.

ఈ అందాల తారలతో పాటు బాలయ్యతో లక్ష్మీనరసింహ, అల్లరి పిడుగు వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన జయంత్ సి పరాన్జీ తనదైన ప్రశ్నలతో షోలో పాల్గొన్నారు. నాటి..నేటి విశేషాలను పంచుకుంటున్న ఎన్బీకే లేటెస్ట్ ఎపిసోడ్ మరింత ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. 

అలాగే ప్రస్తుత మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్..ఈ షోలో బాలయ్యను బ్రో అంటూ సరదా సంభాషణ కేరింతలు పుట్టించేలా ఉంది. ఈ షోలో బాలయ్య ఎనర్జీ, టైమింగ్‌తో అదరగోడుతున్నారు. అంతేకాకుండా..గెస్ట్‌గా ఎవరు వచ్చినా వారితో సరదా మాటలతో పాటు ఆటలు ఆడిస్తూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తున్నారు.