ఉగ్రదాడి యత్నం భగ్నం.. పిస్టల్ స్వాధీనం

ఉగ్రదాడి యత్నం భగ్నం..  పిస్టల్ స్వాధీనం

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ (ఆగస్టు 15) వేడుకలకు సిద్ధమవుతున్న క్రమంలో.. ఉత్తర్ ప్రదేశ్ లో  ఉగ్రదాడి ప్రణాళికను భగ్నం చేసినట్టు ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం అధికారులు తెలిపారు. ఆగస్టు 3న అరెస్టయిన అనుమానిత ఉగ్రవాది అహ్మద్ రజాను విచారించగా.. హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధం ఉన్నట్టు తేలిందని చెప్పారు. అనంతరం వారు మరో రెండ్రోజుల్లో రానున్న జాతీయ పండుగపై ఉగ్రదాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు  అహ్మద్ చెప్పినట్టు వెల్లడించారు.

అహ్మద్ చెప్పిన ప్రదేశానికి వెళ్లిన ఏటీసీ బృందం.. యూఎస్ లో తయారు చేసిన పిస్టల్, కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు అహ్మద్ కు పాకిస్థాన్‌లో ఉన్న చాలా మంది ఉగ్రవాదులతో  సంబంధాలున్నాయని కూడా అధికారులు తెలిపారు. మొరాదాబాద్‌లోని గుల్దియా పోలీస్ స్టేషన్‌కు చెందిన రజా.. ఉగ్రదాడి కోసం కొనుగోలు చేసి పిస్టల్‌ను గ్రామానికి సమీపంలోని ఓ ప్రదేశంలో దాచి  చేసినట్లు విచారణలో చెప్పాడు. సమాచారం అందుకున్న ఏటీఎస్ బృందం.. ఆగస్టు 11న ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంది. 32-బోర్ మ్యాగజైన్‌తో కూడిన 1 పిస్టల్, మందు గుండు సామాగ్రిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రజా కాశ్మీర్‌ అనంతనాగ్ కొండల్లో శిక్షణ పొందాడని, అలాగే వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ చాట్‌ల ద్వారా అతడు పాకిస్థాన్, ఆఫ్ఘన్ ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది.