
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా పథా గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్య నాధ్ నష్ట పరిహారం ప్రకటించారు. లారీ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న వారంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు మామిడికాయలతో వెళ్తున్న లారీ ఎక్కారు. అయితే వారు ప్రయాణిస్తున్న లారీ ఆదివారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్ వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు యూపీ సర్కారు నష్టపరిహారం ప్రకటించింది.