ప్రైవేట్‌‌ రైలు జర్నీ మొదలు

ప్రైవేట్‌‌ రైలు జర్నీ మొదలు
  • 150కొత్తగా ప్రవేశపెట్టబోయేప్రైవేట్‌‌ ట్రైన్లు
  • 2,400ప్రైవేట్‌‌ ట్రైన్లో ఉపయోగించే కోచ్‌‌లు
  • తేజస్‌ ట్రైన్‌ లేటైతే ప్రయాణికులకు డబ్బులు
  • ప్యాసింజర్‌కు రూ.25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్‌

లక్నోదేశంలోని మొదటి ప్రైవేట్‌‌ ట్రైన్‌‌ ‘తేజస్‌‌’ పట్టాలెక్కింది. ఉత్తరప్రదేశ్‌‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ శుక్రవారం జెండా ఊపి రైలును ప్రారంభించారు. “ ఇది దేశంలోనే మొదటి కార్పొరేట్‌‌ ట్రైన్‌‌. ఫస్ట్‌‌ బ్యాచ్‌‌ ప్యాసింజర్లకు కంగ్రాట్స్‌‌. మిగతా సిటీల్లో కూడా ఇటువంటి రైళ్లు రావాలని కోరుకుంటున్నాను. దేశంలోనే మొదటి కార్పొరేట్‌‌ ట్రైన్‌‌ను ప్రారంభించే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌కు థాంక్స్‌‌” అని ఆదిత్యనాథ్‌‌ చెప్పారు. తేజస్‌‌ ట్రైన్‌‌ వారంలో ఆరు రోజులు ఢిల్లీ – లక్నో మధ్య నడుస్తుంది. శనివారం నుంచి కమర్షియల్‌‌ రన్‌‌ స్టార్ట్‌‌ అవుతుందని అధికారులు చెప్పారు. ఈ ట్రైన్‌‌ ప్రారంభంతో ఢిల్లీ –  లక్నో మధ్య జర్నీ  టైమ్‌‌ తగ్గనుంది. కేవలం 6 గంటల15 నిమిషాల్లో లక్నో నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చు. అంటే ప్రస్తుతం దేశంలో వేగంగా వెళ్లే రైలు స్వర్ణ శతాబ్ది కంటే తొందరగా తేజస్‌‌ గమ్యానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్‌‌ సక్సెస్‌‌ అయితే మరికొన్ని ప్రాజెక్టులను ఐఆర్‌‌‌‌సీటీసీకి ఇస్తామని అధికారులు చెప్పారు.

షెడ్యూల్‌‌

  • వారంలో ఆరు రోజులు తిరుగుతుంది. మంగళవారం సెలవు.
  • లక్నోలో ఉదయం 6.10 నిమిషాలకు బయలుదేరి, మధ్యాహ్నం12.25కు ఢిల్లీ చేరుకుంటుంది.
  • ఢిల్లీలో సాయంత్రం 3.35 గంటలకు బయలుదేరి, రాత్రి 10.05 గంటలకు లక్నో చేరుకుంటుంది.

ప్రత్యేకతలు

  • ట్రైన్‌‌ ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున డబ్బులు ఇస్తారు.
  •  ప్రతి ప్యాసింజర్‌‌‌‌కు రూ.25లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్‌‌ ఉంటుంది.
  •  ఫ్లైట్‌‌ చార్జి తరహాలో తేజస్‌‌ ధరలు కూడా డైనమిక్‌‌ ప్రైజింగ్‌‌లో మారుతుంటాయి.

ఆలస్యమైన ప్రాజెక్టులు 2022 నాటికి పూర్తి

ఆలస్యమైన   ప్రాజెక్టులు 2022 నాటికి పూర్తి చేస్తాం.అంతవరకు కొత్త ప్రాజెక్టుల్ని  ప్రారంభించం. ప్రైవేటు ఆపరేటర్లు వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయి. పెట్టుబడికి అవకాశాలు ఉంటాయి.  పోటీ వల్ల  అభివృద్ధి కూడా జరుగుతుంది.  సికింద్రాబాద్‌‌-–ఢిల్లీ రూట్లను కూడా ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చే ఆలోచన ఉంది. –  రైల్వేశాఖ సహాయమంత్రి  సురేశ్‌‌ అంగడి

యాక్షన్‌‌ ప్లాన్‌‌ వివరాలు

  • రూట్లు, టైమ్‌‌ స్లాట్ల ఆధారంగా 2020లో బిడ్లు అవార్డు చేసే చాన్స్‌‌
  • ఎంపిక చేసిన రూట్లలో రైళ్లు గంటకు 160 కి.మి. వేగంతో  ప్రయాణించే అవకాశం.
  • ఆపరేటర్లే టికెట్‌‌ రేట్లను ఖరారు చేస్తారు.
  • రైల్వేలు సర్టిఫై చేసిన డ్రైవర్లను ఆపరేటర్లే   హైర్‌‌ చేస్తారు.
  • లగేజ్‌‌, పిక్‌‌అప్స్‌‌, డ్రాప్స్‌‌ లాంటి వాల్యూయాడెడ్‌‌ సర్వీసుల్ని ఆపరేటర్లే అందిస్తారు.
  • వివాదాలు పరిష్కరించడానికి, టికెట్ల ధరల్ని కంట్రోల్‌‌ చేయడానికి  రెగ్యులేటర్‌‌ను ఏర్పాటు చేస్తారు.

పొటెన్షియల్‌‌ పార్టనర్లు

  • డచే బాన్‌‌ ఏజీ (జర్మనీ)
  • ఎస్‌‌ఎన్‌‌సీఎఫ్‌‌ (ఫ్రాన్స్‌‌)
  • ఎంటీఆర్‌‌ (సింగపూర్‌‌)
  • విర్జిన్‌‌ ట్రైన్స్‌‌ (యూకే)
  • ఫస్ట్‌‌ (యూకే)
  • రెన్ఫే (స్పెయిన్‌‌)