
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’(Jailer). ఆగస్టు 10న రిలీజైన భారీ విజయం సాధించింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. రిలీజైన వారంరోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రజని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
పలు రాష్ట్రాల సీఎంలు కూడా థియేటర్స్ కి వెళ్లి జైలర్ మూవీ చూస్తున్నారు. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్ థియేటర్ కు వెళ్లి జైలర్ సినిమాను చూశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రజినీకాంత్ తో కలిసి జైలర్ సినిమా చూడబోతున్నారు.
After Tamil Nadu & Kerala Chief Ministers, Uttar Pradesh CM Yogi Adityanath will watch #Jailer with superstar #Rajinikanth.pic.twitter.com/hkJm0qRBYm
— Manobala Vijayabalan (@ManobalaV) August 18, 2023
హిమాలయాల యాత్ర నుండి తిరుగు ప్రయాణంలో ఉన్న రజినీకాంత్.. నిన్న రాత్రి లక్నో చేరుకున్నారు. నేడు(ఆగస్టు 19) లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి జైలర్ సినిమా చూడనున్నారు. ఇదే విషయాన్నీ రజనీకాంత్ స్వయంగా మీడియాకు తెలియచేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ రాజకీయ పరంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.