యూపీలో రాష్ట్రవాదీలు, పరివార్ వాదీలకు మధ్య పోరు

యూపీలో రాష్ట్రవాదీలు, పరివార్ వాదీలకు మధ్య పోరు
  • గత ప్రభుత్వాలపై     ప్రధాని మోడీ ధ్వజం

బస్తీ(ఉత్తరప్రదేశ్‌), న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ఎ్ననికలు రాష్ట్రవాదీలు, పరివార్ వాదీలకు మధ్య పోరు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు వారి కమీషన్ల కోసం విదేశీ వస్తువులను ప్రమోట్‌ చేశాయన్నారు. ఈ పరివార్‌‌ వాదీలు మన ఆర్మీని ఇతర దేశాలపై ఆధారపడేలా చేసి, మన రక్షణ రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మనకు డిఫెన్స్‌ కారిడార్‌‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం యూపీలోని బస్తీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడారు. టెర్రరిస్టుల పట్ల సానుభూతి చూపేవారు దేశాన్ని ఎప్పటికీ బలోపేతం చేయలేరని ఎస్పీ చీఫ్‌ లీడర్లను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రాలు శక్తివంతం అయినప్పుడే దేశం పవర్‌ఫుల్‌గా తయారు అవుతుందని, యూపీ పవర్‌‌ఫుల్‌ అయినప్పుడే దేశం పవర్‌‌ఫుల్‌ అవుతుందన్నారు. కుల, మతాల అడ్డంకులను అధిగమించి దేశాన్ని ఆత్మనిర్భర్‌‌గా మార్చడం ద్వారా బలోపేతం కావాల్సిన టైమ్‌ వచ్చిందన్నారు. రాజ్యాంగం వారి జేబుల్లో, పేదలు వాళ్ల కాళ్ల కింద, డబ్బులు వారి లాకర్లలో ఉండాలని వారు కోరుకుంటున్నారని చెప్పారు. కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందరీని క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని మోడీ చెప్పారు. 

మాతృభాషలో గర్వంగా మాట్లాడండి

దేశ ప్రజలు తమ మాతృభాషలో గర్వంగా మాట్లాడాలని ప్రధాని మోడీ చెప్పారు. మన్‌ కీ బాత్‌లో భాగంగా ఆదివారం ఆయన రేడియోలో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా.. మన భాష, వేషం, తిండి తదితర విషయాల్లో ప్రజలు సందిగ్ధంలో ఉన్నారని చెప్పారు.