36ఏళ్లుగా కూతురిని గదిలో బంధించిన తండ్రి

36ఏళ్లుగా కూతురిని గదిలో బంధించిన తండ్రి

మానసిక పరిస్థితి బాగాలేదన్న కారణంతో కన్న కూతురిని 36ఏళ్లుగా ఒక గదిలో బంధించాడు ఓ తండ్రి. గది తలుపు కింద నుంచే భోజనాన్ని అందిస్తూ.. కిటికీలో నుంచి నీళ్లు పోసేవాళ్లు. ఆ గదిలో ఆమె మల, మూత్ర విసర్జన కూడా చేసేది. అయితే ఇటీవల ఆ తండ్రి మరణించడంతో ఈ విషయం బయటికి వచ్చింది. అనంతరం ఓ ఎన్జీవో ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను విడిపించారు. ఇప్పుడు ఆమె వయసు 53ఏళ్లు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ మహమ్మాదాబాద్ లో చోటు చేసుకుంది. సప్నా జైన్ అనే ఈ మహిళకు మానసిక పరిస్థితి లేదని ఆమె తండ్రి  ఆమెను గదిలో పెట్టి, గొలుసులతో కట్టి బంధించాడు. అప్పటికీ సప్నా వయస్సు 17 ఏళ్లు.

ఈ ఘటన అనంతరం స్థానిక ఎన్జీవో సేవా భారతి సభ్యులు బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహౌర్ కు సమాచారం అందించారు. ఆ తర్వాత ఆమెను బంధీ నుంచి విడుదల చేశారు. అయితే ఆమెను రిలీజ్ అయ్యేటప్పటికి ఆమె చాలా దీనస్థితిలో ఉందని సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలాసింగ్ చెప్పారు. ప్రస్తుతం ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.