
ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జై ప్రతాప్ సింగ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ప్రతాప్ సింగ్ తెలిపారు. రాబోయే 10 రోజులు హోం క్వారంటైన్ లోనే ఉండాలని డాక్టర్లు మంత్రికి సూచించారు. ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యుల శాంపుల్స్‌ను కూడా వైద్య అధికారులు సేకరించి వైద్య పరీక్షలకు పంపారు. ఫలితాలు శనివారం లోగా వస్తాయని తెలిపారు.కాగా.. యూపీలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,529 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,000కు చేరింది. కొత్తగా 34 మందితో కలిపి మొత్తం 1,298 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.