యూపీ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు

 యూపీ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ గెలుపు
  • 27 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 22 స్థానాల్లో గెలుపు
  • వారణాసిలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ విజయం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 22 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసిలో మాత్రం బీజేపీ ఓడిపోయింది. వారణాసిలో స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ విజయం సాధించింది. అయోధ్య, గొరఖ్ పూర్, ఉన్నావ్, రాయ్ బరేలి సహా.. అనేక చోట్ల బీజేపీ మెజారిటీ సాధించింది. రాష్ట్రంలో మొత్తం 36 శాసనమండలి స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 27 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి..ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 100 మంది  సభ్యులు గల యూపీ శాసనమండలిలో ప్రస్తుతం బీజేపీకి 34 మంది, ఎస్పీకి 17, బీఎస్పీకి నలుగురు సభ్యులు ఉన్నారు. 

 

ఇవి కూడా చదవండి

దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?

 

కర్ణాటకలో కలకలం రేపిన కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి

వడ్లను మేమే కొంటం

జ‌ల‌మండ‌లి మేనేజ‌ర్‌, వ‌ర్క్ ఇన్‌స్టెక్ట‌ర్‌ స‌స్పెండ్

అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం