యూపీ స్కీం: చిన్నారులకు రోటీ,ఉప్పు పౌష్టికాహార పథకం

యూపీ స్కీం: చిన్నారులకు రోటీ,ఉప్పు పౌష్టికాహార పథకం

ఉత్తర ప్రదేశ్‌లో చిన్నారులకు అమలు చేస్తున్న పౌష్టికాహార పథకం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ చదువుతున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. యూపీలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే చాలా చోట్ల మెనూలో ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వడం లేదు. మీర్జాపూర్‌లోని ఒక స్కూల్లో విద్యార్థులకు ఒక చపాతి, ఉప్పు ప్లేట్లలో పెట్టి ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

మధ్యాహ్న భోజన పథకం అధికారుల వెబ్‌సైట్‌లో భోజనం వివరాలను పొందుపరిచారు. దాని ప్రకారం విద్యార్థులకు అన్నం, చపాతీలు, కూరలు ఇవ్వాలి. ఎంపిక చేసిన కొన్ని రోజుల్లో పళ్లు, పాలు ఇవ్వాలి. అయితే విద్యార్థులకు ఒక చపాతి, కొద్దిగా ఉప్పు ఇస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు రోటీ, ఉప్పు ఇస్తున్నారని, కొన్నిసార్లు కొద్దిగా అన్నం, ఉప్పు ఇస్తారని చెబుతున్నారు. స్కూల్‌కు ఎప్పుడైనా పాలు, అరటిపళ్లు వచ్చినా పిల్లలకు ఎన్నడూ ఇవ్వలేదని.. గతేడాదిగా ఇదే తంతు జరుగుతోందంటున్నారు.