ఇంటర్నెట్​ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్

ఇంటర్నెట్​ లేకుండానే UPI ట్రాన్సాక్షన్స్

ఫోన్​ పే, గూగుల్​ పే.. లాంటి ఆన్​లైన్​ ట్రాన్సాక్షన్​ యాప్స్​ వచ్చాక చేతిలో డబ్బులు పట్టుకెళ్లడమే మానేశారు చాలామంది. కానీ, యుపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్​ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇంటర్నెట్​ స్లో అవుతుంది. మరికొన్ని సార్లు పూర్తిగా పోతుంది. ఎమర్జెన్సీ టైంలో ఈ సమస్య చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. అయితే దీనికి ఒక సొల్యూషన్​ ఉంది. ఇంటర్నెట్​ లేకుండానే యుపీఐ ట్రాన్సాక్షన్స్​ చేయొచ్చు. దానికోసం *99# కి ఫోన్​ చేస్తే సరిపోతుంది. 

*99#  అనేది అన్​స్ట్రక్చర్డ్​ సప్లిమెంటరీ సర్వీస్​ డేటా.. దీని ద్వారా డేటా, ఇంటర్నెట్​ కనెక్షన్​ లేకుండా మొబైల్​ బ్యాంకింగ్​ని యాక్సెస్​ చేసుకోవచ్చు. 83 బ్యాంక్​లతో నాలుగు టెలికామ్​ సర్వీస్​ ప్రొవైడర్స్​,  పదమూడు భాషల్లో అందుబాటులో ఉంది​. మరి దీని ద్వారా పేమెంట్​ ఎలా చేయాలంటే.. '

రిజిస్ట్రేషన్​ కోసం

  •   స్మార్ట్​ఫోన్​ లేదా ఫీచర్​ ఫోన్​ ద్వారా *99# కి డయల్ చేయాలి. అయితే ఈ సర్వీస్​ని ఉపయోగించుకోవాలంటే బ్యాంక్​ అకౌంట్​​కి ఏ నెంబర్​ అయితే లింక్​ అయి ఉందో ఆ నెంబర్​ నుంచే ఫోన్​ చేయాలి. 
  •   కావాల్సిన భాష,  బ్యాంక్​ పేరు ఎంటర్​ చేయాలి. 
  •   మన ఫోన్​ నెంబర్​తో లింక్​ అయ్యి ఉన్న బ్యాంక్​ అకౌంట్స్​ అన్నీ వరుసగా కనిపిస్తాయి. వాటిల్లో ప్రస్తుతం డబ్బులు పంపాలనుకుంటున్న అకౌంట్​ మీద క్లిక్​ చేయాలి. 
  •   డెబిట్​ కార్డు చివరి ఆరు నెంబర్స్​​తో పాటు ఎక్స్​పైరీ డేట్​ని ఎంటర్​ చేయాలి. ఈ స్టెప్స్​ పూర్తయ్యాక ఆఫ్​లైన్​లో​ పేమెంట్​ ట్రాన్సాక్షన్​ మొదలుపెట్టొచ్చు.

ఇలా పంపాలి

  •  *99#  డయల్​ చేసి, 1క్లిక్​ చేసి ‘సెండ్​ మనీ’ ఆప్షన్​కి వెళ్లాలి.
  •  తర్వాత ఇతరుల యుపీఐ ఐడీకి డబ్బులు పంపాలనుకుంటే 3, ఫోన్​ నెంబర్​కి అయితే 4, బ్యాంక్​ అకౌంట్​ నెంబర్​కి అయితే 5 నెంబర్​ ఎంటర్​ చేసి.. ఆ వివరాలు ఇవ్వాలి. 
  •  పంపాల్సిన అమౌంట్​, యుపీఐ పిన్​ ఎంటర్​ చేస్తే ఇంటర్నెట్ లేకుండానే ట్రాన్సాక్షన్​ పూర్తవుతుంది. ఈ సర్వీస్​కి యాభై పైసలు ఛార్జీలు అవుతాయి. దీని ద్వారా ప్రస్తుతం రూ.5వేలు మాత్రమే ట్రాన్సాక్షన్​ చేసే వెసులుబాటు ఉంది. ట్రాన్సాక్షన్​తో పాటు బ్యాలెన్స్​ ఎంక్వైరీ, రిక్వెస్ట్​ మనీతో పాటు యుపీఐ పిన్​ మార్చుకునే సదుపాయం కూడా ఉంది ఈ సర్వీస్​లో.