
UPSC 2025 ఎగ్జామ్స్ ప్రిపేరయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్.. UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్లు upsc.gov.in, www.upsconline.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8న పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షలు రాసే అభ్యర్థులకు అధికారిక నోటీస్ జారీ చేసింది UPSC. ఈఅడ్మిట్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకోవాలి.. ఇది పరీక్షా కేంద్రంలోకి ఎంటరయ్యే సమయంలో తప్పకుండా వెంటఉంచుకోవాలి. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్షకు అనుమతివ్వరు. ప్రతీ సెషన్ కు ఈ అడ్మిట్ కార్డును తమ వెంటను తీసుకెళ్లాలి.
డౌన్లోడ్ చేసుకోండిలా..
- UPSC అధికారిక వెబ్‌సైట్ - upsc.gov.in లోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీలో UPSC ESE ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అవసరమైన లాగిన్ ఆధారాలను ఇవ్వాలి.
- వివరాలను నమోదు చేసిన తర్వాత, సబ్మిట్ క్లిక్ చేయాలి. అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అడ్మిట్ కార్డులో పేర్కొన్న వివరాలను సరిచూసుకొని సేవ్ చేసుకోవాలి.
- భవిష్యత్ ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.
అడ్మిట్ కార్డులో ఏవైనా తేడాలు ఉంటే, అభ్యర్థులు వెంటనే upsc@nic.in కు ఇమెయిల్ పంపడం ద్వారా కమిషన్‌ను సంప్రదించాలి.