ISROలో ఉద్యోగాలు: జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎలాంటి పరీక్షా లేదు.

ISROలో ఉద్యోగాలు: జేఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎలాంటి పరీక్షా లేదు.

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్ సీ) జూనియర్ రీసెర్చ్  ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో. 

మొత్తం ఖాళీలు:17. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎం.టెక్/ ఎంఎస్సీ (ఇంజినీరింగ్) పూర్తిచేసి ఉండాలి. సీఎస్ఐఆర్– యూజీసీ నెట్, గేట్, జేఏఎం, జేఈఎస్​టీ వంటి జాతీయ పరీక్షలో క్వాలిఫై అయి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు.  ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 12.

లాస్ట్ డేట్: జులై 11. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.isro.gov.inను సందర్శించండి.