ఇస్సాపల్లి గ్రామంలో యూరియా కోసం రైతుల పాట్లు

ఇస్సాపల్లి గ్రామంలో యూరియా కోసం  రైతుల పాట్లు

మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతులు తంటాలు పడ్డారు. సొసైటీ గోదాం వద్ద  చెట్టు కొమ్మలు, రాళ్లను క్యూలో పెట్టారు. బీజేపీ కిసాన్​ మోర్చా నాయకుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకుని మొక్కజొన్నకు యూరియా వేయాల్సిన సమయంలో ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే మార్క్​ఫెడ్ డీసీవో, డీవోతో ఫోన్​ లో మాట్లాడి రైతుల సమస్య తీర్చేందుకు సరిపోయేంత యూరియా సప్లై చేయాలని కోరారు.  -ఆర్మూర్​, వెలుగు: