Urvashi Rautela: బాలయ్య 'NBK 109' సెట్‌లో ప్రమాదం..ఊర్వశి రౌతేలాకి తీవ్ర గాయాలు!

Urvashi Rautela: బాలయ్య 'NBK 109' సెట్‌లో ప్రమాదం..ఊర్వశి రౌతేలాకి తీవ్ర గాయాలు!

ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela)..ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్ కు టాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ గుర్తొస్తాయి.అవును..టాలీవుడ్ లో ఆమె చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ సూపర్ హిట్.బాలీవుడ్,టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా.అందంతో,తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం బాలకృష్ణ NBK 109 మూవీలో నటిస్తుంది. 

అసలు విషయానికి వస్తే..NBK 109మూవీ మూడో షెడ్యూల్‌ కోసం ఊర్వశి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చింది.అయితే,ఈ NBK 109సెట్‌లో ఓ యాక్షన్  సీన్ షూట్ చేసున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్‌ కాగా తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆసుపత్రిలో చేరారు.ఆమె ఇంటర్‌ట్రోచాంటెరిక్ హిప్ ఫ్రాక్చర్‌కు గురైందని..వైద్యుల పర్యవేక్షణలో ఉత్తమమైన చికిత్స పొందుతున్నట్లు మేకర్స్ కన్ఫమ్ చేశారు. ఇకపోతే ఆమె ఆరోగ్యంపై మరిన్ని అప్‌డేట్‌లు రావాల్సి ఉంది.ఎందుకంటే, బాలీవుడ్,హాలీవుడ్ లో పాపులర్ మోడల్ గా గుర్తింపు పొందిన నటి కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. 

ఊర్వశీ రౌతేలా తెలుగు సినిమాల విషయానికి వస్తే..మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్యలోని వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్ గుర్తుంది కదా. ఆ పాటలో మెగాస్టార్ పక్కన గ్లామర్ వలకబోసింది ఈ బ్యూటీనే.అంతేకాదు బ్రో సినిమాలో పవన్ పక్కన, స్కంద సినిమాలో రామ్ పక్కన కూడా చిందేసింది ఈ బ్యూటీ. వరుసగా టాలీవుడ్ లో నాలుగు ఐటెం సాంగ్స్లో యాక్ట్ చేసి..కుర్రాళ్లకు హీటెక్కించేస్తోంది.మరి బాలయ్య సరసన అంటే మాస్ హీట్ పెంచుతుందేమో!