ఊర్వశి రౌటేలాకి చిరంజీవి సినిమాలో చాన్స్

ఊర్వశి రౌటేలాకి చిరంజీవి సినిమాలో చాన్స్

మ్యూజికల్ వీడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లామరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న  ఊర్వశి రౌటేలా.. ఈ మధ్య  స్పెషల్ సాంగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కేరాఫ్ అడ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇటీవల కాలంలో ఆమె పేరు టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాగా వినిపిస్తోంది. ఆల్రెడీ రామ్, బోయపాటి మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. తాజాగా మెగాస్టార్ మూవీలో చాన్స్ అందుకుంది. బాబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిరంజీవి నటిస్తోన్న  సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఊర్వశి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ప్రకటించారు మేకర్స్. చిరుతో పాటు ఆమెపై స్పెషల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసిన  భారీ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షూట్ చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్  కంపోజ్ చేసిన మాస్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు,  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. చిరంజీవి, రవితేజలపైనా కూడా ఓ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షూట్ చేశారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేసిన టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేశారు.