ఆ విషయం దాచడం ఎన్నికల్లో ప్రభావం చూపింది

ఆ విషయం దాచడం ఎన్నికల్లో ప్రభావం చూపింది

కరోనా టీకా అభివృద్ధిపై ట్రంప్ స్పందన

ఇది తన ఓటమి కాదంటూ ప్రత్యర్థులపై విమర్శలు

వాషింగ్టన్: తన ఓటమిని అంగీకరించడానికి అధ్యక్షుడు ట్రంప్ నిరాకరిస్తూనే ఉన్నాడు. ఎన్నికల ఫలితాల తీరును విశ్లేషిస్తూ.. విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. కరోనా నివారణకు బయో ఎన్ టెక్ తో కలసి తాము తయారు చేసిన టీకా చాలా అధ్భుతంగా పనిచేస్తోందని.. 3 దశల్లో చేసిన క్లినికల్ ట్రయల్స్ లో  90 శాతం వరకు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయని ఫైజర్ సంస్థ ప్రకటించింది. అత్యవసర వినియోగం కింద తమ టీకా వినియోగించేందుకు అనుమతివ్వాలని నెలాఖరులోగా అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డి ఏ)కు దరఖాస్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఫైజర్ సంస్థ ప్రకటనపై  ట్రంప్ స్పందించారు. కరోనా నివారణ కోసం తాను చేసిన కృషి వల్లే కొత్త టీకా రెడీ అయిందన్నారు. క్లినికల్ ట్రయల్స్ కు అనుమతివ్వడంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణ నష్టం ఇంకా పెరుగుతుందని తాను వేగంగా అనుమతిచ్చానని గుర్తు చేశారు. బైడెన్ తన స్థానంలో ఉండి ఉంటే క్లినికల్ ట్రయల్స్ కు అనుమతివ్వడంలో ఆలస్యం చేసే వారని.. అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఉదాసీనంగా వ్యవహరించి ఉండేదాన్నారు. వీరి నిర్వాకం వల్ల కరోనా నివారణ టీకా మరింత ఆలస్యమై ఉండేదన్నారు. 

ఈ టీకా 90 శాతం ఫలితాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ.. బయటి ప్రపంచానికి విషయం తెలియకుండా ఎఫ్ డీఏ దాచిపెట్టిందన్నారు. దాని వల్లే తన ప్రయత్నాలు.. కృషి ప్రజలకు తెలిసే అవకాశం లేక ఎన్నికల్లో ప్రభావం చూపిందన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టకుండా ఉండి ఉంటే ప్రజల్లో నమ్మకం.. ధైర్యం పెరిగి ఉండేదన్నారు. ఎన్నికల ఫలితాలు తన వైపు ఏకపక్షంగా ఉండేవన్నారు.

తన విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని చికాకుపడిన ట్రంప్.. ఇప్పటికైనా మీడియాను దూరంగా పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రచార సమయంలో.. ఓటింగ్ కు ముందు.. నిధుల సేకరణ అంశాల్లో మీడియా తనకు వ్యతిరేకంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తప్పుడు అంచనా రిపోర్టు చేశాయన్నారు. తాను వెనుకబడిపోతున్నట్లు పదేపదే ప్రచారం చేసి ఓటర్లను కన్ ఫ్యూజ్ చేశారని.. చాలా మీడియా సంస్థలు అంచనాల పేరిట తనకు తక్కువ సీట్లు ఇచ్చాయని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.