ఇంకో పదేళ్లలో జీడీపీ రూ.697 లక్షల కోట్లకు!

ఇంకో పదేళ్లలో జీడీపీ   రూ.697 లక్షల కోట్లకు!
  •     ప్రస్తుత రూ.279 లక్షల కోట్ల కంటే డబుల్‌‌‌‌
  •     గ్లోబల్‌‌‌‌ గ్రోత్‌‌‌‌లో ఐదో వంతు ఇండియా నుంచే
  •     15 ఏళ్ల కింద చైనా ఉన్న పొజిషన్‌‌‌‌లో ప్రస్తుతం ఇండియా
  •     వెల్లడించిన మోర్గాన్ స్టాన్లీ 

న్యూఢిల్లీ: దేశ జీడీపీ రానున్న పదేళ్లలో  రెండింతలు కంటే ఎక్కువ పెరుగుతుందని యూఎస్  ఫైనాన్షియల్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ అంచనావేస్తోంది. ప్రస్తుతం ఉన్న 3.4 ట్రిలియన్ డాలర్ల (రూ.278 లక్షల కోట్ల) ఎకానమీ 2032 నాటికి  8.5 ట్రిలియన్ డాలర్ల (రూ.697 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని పేర్కొంది. అతిపెద్ద దేశం కావడం  ఇండియాకు పెద్ద అడ్వాంటేజ్ అని వివరించింది.   2027 నాటికి  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని  అంచనావేసింది. దేశ జీడీపీ ప్రతీ ఏడాది 400 బిలియన్ డాలర్లు చొప్పున  పెరుగుతుందని ఈ సంస్థ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.  చైనా, యూఎస్‌‌‌‌ల జీడీపీ  కూడా ఇంత పెద్ద మొత్తంలో పెరగదని వివరించింది.  లోకల్‌‌‌‌గా, గ్లోబల్‌‌‌‌గా సానుకూల పరిస్థితులు ఉంటాయనే అంచనాలతో ఈ రిపోర్ట్‌‌‌‌ను కంపెనీ తయారు చేసింది.  దేశీయంగా జాబ్స్ క్రియేట్ చేయడానికి, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఆకర్షించడానికి  పాలసీలు తీసుకోవడం ముఖ్యమని తెలిపింది. ఇందుకోసం  ప్రభుత్వం ఇప్పటికే అనేక పాలసీలు తీసుకొచ్చిందని గుర్తు చేసింది. జీఎస్‌‌‌‌టీతో  దేశంలో ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌ను సులభతరం చేసిందని, కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌లను తగ్గించడం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌ (పీఎల్‌‌‌‌ఐ) లతో లోకల్‌‌‌‌, గ్లోబల్ కంపెనీల  నుంచి ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను ఆకర్షించడం చేస్తోందని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. ‘ఈ అంశాలన్నీ గ్లోబల్‌‌‌‌ ఎకానమీలో ఇండియా వర్క్ ఫోర్స్ మరింత వేగంగా విస్తరించడంలో సాయపడతాయి. ఇప్పటికే సర్వీస్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు మంచి వాటా ఉంది. కరోనా సంక్షోభం వలన కార్పొరేట్ కంపెనీలన్నీ రిమోట్ వర్క్‌‌‌‌ వైపు షిఫ్ట్ అవుతున్నాయి. ఫలితంగా ఇండియా సర్వీస్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ మరింత విస్తరిస్తుంది’ అని వివరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఇంకో ఏడేళ్లలో దేశ జీడీపీ మరో 3 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుంది.  వచ్చే పదేళ్లలో దేశ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం ఉన్న  3.04 ట్రిలియన్ డాలర్ల నుంచి 11 ట్రిలయన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ సంస్థ పేర్కొంది.   

ఇతర దేశాల కంటే వేగంగా..

చైనా గ్రోత్‌‌‌‌ను చూసిన గ్లోబల్‌‌‌‌ ఇన్వెస్టర్లు   ఇండియాలోని పరిస్థితులను సద్వినియోగం చేసుకోవచ్చని ఈ సంస్థ అంచనావేసింది.  2‌‌‌‌‌‌‌‌007 లో ఉన్న చైనా జీడీపీకి సమానంగా ప్రస్తుతం ఇండియా జీడీపీ ఉంది.  అంటే జీడీపీల పరంగా  ఇండియాకు, చైనాకు మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉందని తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, దేశంలో పని చేయగలిగే జనాభా వేగంగా పెరుగుతున్నారు. పనిచేయగలిగే సగటు వ్యక్తి  ఏజ్ చైనాతో పోలిస్తే 11 ఏళ్లు తక్కువగా ఉంది. దీని బట్టి దేశంలో గ్రోత్ వేగంగా ఉంటుందని ఈ సంస్థ అంచనావేస్తోంది. ఇండియా రియల్‌‌‌‌ జీడీపీ గ్రోత్ రేటు వచ్చే 10 ఏళ్లలో సగటున 6.5 శాతం ఉండగా, ఇదే టైమ్‌‌‌‌లో చైనా జీడీపీ గ్రోత్ రేట్‌‌‌‌ 3.6 శాతంగా ఉంటుందని తెలిపింది.  చైనాలో ఇండస్ట్రియలైజేషన్ గత 30 ఏళ్లలోనే ఎక్కువగా జరిగింది. ఈ టైమ్‌‌‌‌లో  అక్కడి ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు వంటి  ఇన్‌‌‌‌ఫ్ట్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం ఇండియా కూడా ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌పై భారీగా ఖర్చు చేయాలని ప్లాన్స్ వేస్తోంది. ఇతర దేశాలకు భిన్నంగా ఇండియాలో ప్రభుత్వమే డిజిటల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసుకుందని, ఆధార్ వంటి వాటితో ప్రజలకు సాయపడేలా,  బిజినెస్‌‌‌‌లు మెరుగుపడేలా చర్యలు తీసుకోవచ్చని ఈ సంస్థ పేర్కొంది. వ్యాపార ఖర్చులను తగ్గించొచ్చని, ట్రాన్సాక్షన్లను మెరుగుపరచొచ్చని వివరించింది. వచ్చే పదేళ్లలో గ్లోబల్ ఎకానమీ వృద్ధి చెందడంలో ఐదో వంతు గ్రోత్‌‌‌‌ ఇండియా నుంచే ఉంటుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో  గ్రోత్‌‌‌‌ ఎక్కడ ఉంటుందా? అని ఎదురుచూస్తున్న   మల్టీనేషనల్ కంపెనీలకు, గ్లోబల్‌‌‌‌ ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడింది.