యూఎస్ ఓపెన్‌ గ్రాండ్ స్లామ్‌ గెలిచిన 18 ఏళ్ల అమ్మాయి

యూఎస్ ఓపెన్‌ గ్రాండ్ స్లామ్‌ గెలిచిన 18 ఏళ్ల అమ్మాయి

యూఎస్ ఓపెన్  మహిళల సింగిల్స్ లో  సంచలనం నమోదైంది.  18 ఏళ్ల  బ్రిటీష్ అమ్మాయి  ఎమ్మా రుదకాను  హిస్టరీ  క్రియేట్ చేసింది. ఇద్దరు  అన్ సీడెడ్  ప్లేయర్ల మధ్య  జరిగిన  ఫైనల్ మ్యాచ్ లో  ఎమ్మా టైటిల్  సాధించింది. కెనెడాకు  చెందిన 19 ఏళ్ల   లెలా ఫెర్నాండేజ్ తో  ఫైనల్ లో తలపడింది  ఎమ్మా రుదకాను.  6-4, 6-3  తో వరుస  సెట్లలో  లెలా ఫెర్నాండేజ్ ను  ఓడించి కెరీర్ లో  ఫస్ట్ గ్రాండ్  స్లామ్  సాధించింది  ఎమ్మా. యూఎస్ ఓపెన్  గ్రాండ్ స్లామ్  గెలిచిన మొదటి క్వాలిఫయర్  ప్లేయర్ గా   రికార్డ్ క్రియేట్  చేసింది ఎమ్మా.  53 ఏళ్ల  తర్వాత  యూఎస్ ఓపెన్ గెలిచిన బ్రిటీష్  క్రీడాకారిణిగా  కొత్త చరిత్ర   సృష్టించింది. అలాగే  44 ఏళ్ల  తర్వాత  బ్రిటీష్ ప్లేయర్ గ్రాండ్ స్లామ్  గెలవడం  ఇదే ఫస్ట్ టైమ్.

ఫైనల్  మొత్తం ఉత్కంఠగా  సాగింది. ఎమ్మా,   లెలా నువ్వానేనా  అన్నట్టు తలపడ్డారు. ఫస్ట్ సెట్ ను  6-4తో గెలిచిన   ఎమ్మా... సెకండ్ సెట్ ను  రెట్టించిన ఉత్సాహంతో  ఆడింది. 6-3తో సెకండ్ సెట్ గెలిచి...  గ్రాండ్ స్లామ్  టైటిల్ ఒడిసిపట్టింది. యూఎస్ ఓపెన్ లో  టోర్నీలో  ఫైనల్ సహా 9 మ్యాచ్ లు ఆడింది  ఎమ్మా. ఏ మ్యాచ్ లో  కూడా  ఒక్క సెట్ లోనూ  ఓడిపోలేదు ఎమ్మా. ఇది కూడా ఒక రికార్డే.  యూఎస్ ఓపెన్ ప్రారంభానికి  ముందు  ఎమ్మా 150వ  ర్యాంక్ లో ఉండగా... టైటిల్ గెలుపుతో  23వ  ర్యాంకుకు చేరింది.