నేను ప్రెసిడెంట్ అయితే.. ఎలాన్ మస్కే నా అడ్వైజర్​

నేను ప్రెసిడెంట్ అయితే.. ఎలాన్ మస్కే నా అడ్వైజర్​
  • వివేక్ రామస్వామి కామెంట్​

వాషింగ్టన్: తాను ప్రెసిడెంట్​గా ఎన్నికైతే ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్​ను తన సలహా దారుగా అపాయింట్ చేసుకుంటానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వివేక్ రామస్వామి చెప్పారు. అయోవాలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు. ట్విట్టర్​ను కొనుగోలు చేశాక ఆ కంపెనీలో మస్క్ చేపట్టిన రిఫామ్స్ ను రామస్వామి మెచ్చుకున్నారు. అతను ట్విట్టర్​లో పనిచేస్తున్న 75% మందిని తొలగించా డని, ఆ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. 

8,000 మంది ఉద్యోగులను 1,500కు తగ్గించి కూడా కంపెనీని సక్సెస్​ఫుల్ గా రన్ చేస్తున్నాడని.. అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని కూడా బాగా నడిపించగలడన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. తాను ఫ్రెష్ ఇంప్రెషన్ ఉన్న వ్యక్తులను కోరుకుంటు న్నానని తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయడానికి వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.