డ్రాగన్ కంట్రీపై అమెరికా ఆంక్షలు విధించనుందా?

డ్రాగన్ కంట్రీపై అమెరికా ఆంక్షలు విధించనుందా?

వాషింగ్టన్: హాంకాంగ్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరుపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. హాంకాంగ్ పై నేషనల్ సెక్యూరిటీ చట్టాలను విధించడంపై కోపంగా ఉన్న యూఎస్ ప్రతిగా డ్రాగన్ కంట్రీపై పలు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చూచాయగా తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. హాంకాంగ్ పై చైనా వ్యవహరిస్తున్న తీరుకు ప్రతిగా డ్రాగన్ కంట్రీపై ఏవైనా ఆంక్షలు విధించబోతున్నారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పారు. ‘ఇప్పుడు మేం ఏదో ఒకటి చేస్తున్నాం. నాకు తెలిసి మీరో ఆసక్తికరమైన విషయాన్ని గుర్తిస్తారు. దాని గురించి నేను ఇవ్వాళ మాట్లాడను. ఈ వారాంతంలోపు మీరే దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటారు. అది చాలా శక్తిమంతమైనదిగా భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.