న్యూయార్క్: అమెరికాలో ఎన్నికల వేడి జోరందుకుంటోంది. బరిలో ఉన్న బిడెన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార జోరు పెంచారు. బిడెన్‌పై ట్రంప్ మాటల తూటాలు వదులుతున్నారు. వచ్చే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ గెలిస్తే అమెరికా పతనమవుతుందని ట్రంప్ చెప్పారు. బిడెన్ ప్రతిపాదిత పాలసీలు దేశానికి మంచివి కావన్నారు.
The world will be laughing and taking full advantage of the United States if Joe Biden ever became President. Our Country would COLLAPSE! pic.twitter.com/lxcyxYL9YC
— Donald J. Trump (@realDonaldTrump) August 13, 2020
‘అమెరికా ప్రజల నుంచి తనకు ఆదరణ కొరవడటంతో వాళ్లను భయపెట్టడానికి బిడెన్ మహమ్మారిని రాజకీయం చేస్తున్నారు. అది అంతే మరి. ప్రతి మలుపులోనూ వైరస్‌ను బిడెన్ తప్పుగానే అంచనా వేస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలను పట్టించుకోకుండా లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకవేళ జో బిడెన్ ప్రెసిడెంట్ అయితే మాత్రం ప్రపంచం మొత్తం యునైటెడ్ స్టేట్స్‌ను చూసి నవ్వుకుంటుంది. మన దేశం పతనమవుతుంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
