
- హెల్త్స్టాఫ్ కు బ్రిటన్ సూచన
లండన్: ఎక్విప్ మెంట్ కొరత కారణంగా కరోనా పేషెంట్లకు ఫుల్ లెంగ్త్ ప్రొటెక్టివ్ గౌన్స్ లేకుండానే ట్రీట్ మెంట్ కొనసాగించాలని హెల్త్ కేర్ స్టాఫ్ కు బ్రిటన్ సూచించింది. గౌన్ల తక్కువగా ఉన్నాయని, అవసరమైన ఎక్విప్ మెంట్ ఈ వారాంతానికి వస్తుందని ఆశిస్తున్నామని కమిటీ ఆఫ్ లామేకర్స్ కు బ్రిటన్ హెల్త్ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ చెప్పారు. అక్కడి ఆస్పత్రుల్లో కొన్ని గంటల్లోనే ఎక్విప్ మెంట్ సప్లయి అయిపోవడంతో పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. దీని ప్రకారం ఫుల్ లెంగ్త్, వాటర్ ప్రూఫ్సర్జికల్ గౌన్లను కేవలం హై రిస్క్ హాస్పిటల్స్ లో వేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఒకసారి వాడిన గౌన్లనే రీయూజ్ చేయాల్సిందిగా డాక్టర్లు, నర్సులకు సూచించింది. సర్జికల్ గౌన్స్ లేకపోతే ప్లాస్టిక్ ఆప్రాన్స్ నూ వాడొచ్చని తెలిపింది.