మచ్చలు లేని చర్మం కోసం..

మచ్చలు లేని చర్మం కోసం..

చర్మం బాగుండాలని చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్​ వాడుతుంటారు. అయితే వాటిలో ఉన్న కెమికల్స్​ వల్ల అవి అందరికీ సరిపడవు. దాంతో మంచిగున్న చర్మానికి ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. అలాకాకుండా ఉండాలంటే... ఏ స్కిన్​ టైప్​ వాళ్లకయినా సరిపడే ప్రొడక్ట్​ వాడాలి. మాండెలిక్​ యాసిడ్​తో తయారు చేసిన ప్రొడక్ట్స్​ అయితే అన్ని రకాల స్కిన్​కి సరిపడతాయి. సెన్సిటివ్​, ఎగ్జిమా సమస్యలు ఉన్న వాళ్లు కూడా వీటిని వాడొచ్చంటోంది స్కిన్​కేర్​ ఎక్స్​పర్ట్​ స్వాతి టక్కర్​. ఇంతకీ మాండెలిక్​ యాసిడ్​ ఏంటి? అది చర్మాన్ని ఎలా కాపాడుతుంది? ఆ వివరాలే ఇవి...

మాండెలిక్​ యాసిడ్ కూడా ఒకరకమైన ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. చేదుగా ఉండే  బాదం పలుకుల నుంచి దీన్ని  తయారుచేస్తారు. గ్లైకోయిక్, లాక్టిక్​ యాసిడ్ల కంటే దీని సైజ్​ (మాలిక్యులర్​ వెయిట్)​ ఎక్కువ. దాంతో మిగతా యాసిడ్స్​ లెక్క ఇది తొందరగా స్కిన్​ సెల్స్​లోకి ఇంకదు. అందువల్ల ఈ యాసిడ్​ ఉన్న క్రీమ్స్​ రాసుకుంటే చర్మం ఎర్రబారడం, దురద పుట్టడం వంటి సమస్యలు రావు. దీని స్పెషాలిటీ ఏంటంటే... చర్మం లోపలి కణాల్లోకి వెళ్లి, ముఖం మీద ఏర్పడే కురుపులు, మచ్చలు, టాన్​ వంటివి పూర్తిగా తగ్గించడంలో మిగతా యాసిడ్స్​ కంటే ఎఫెక్టివ్​గా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్, సూర్యకిరణాల వల్ల ఏర్పడే మెలస్మా (చర్మం మీద ఏర్పడే బూడిద, నీలం రంగు ప్యాచెస్) ని పోగొట్టడంలో గ్లైకోయిక్​ యాసిడ్ లెక్కనే పనిచేస్తుందని స్కిన్​కేర్​ రీసెర్చ్​లో తేలింది కూడా. క్లెన్సర్​, టోనర్​లతో పాటు సీరమ్​, కెమికల్​ పీల్స్​లో మాండెలిక్​ యాసిడ్​ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు మాండెలిక్​ యాసిడ్​ ఉన్న క్లెన్సర్​, టోనర్​ రాసుకోవాలి. నాలుగు వారాలు ఇలాచేస్తే చర్మం ఫ్రెష్​గా, ఆరోగ్యంగా ఉంటుంది.  

ముడతలు పోతాయి

వయసు పెరిగిన కొద్దీ చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్​ ప్రొటీన్ల శాతం తగ్గిపోయి, చర్మం ముడతలు పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మాండెలిక్​ యాసిడ్ ఉన్న క్లెనర్స్, టోనర్స్​ వాడాలి. ఈ యాసిడ్​ కొల్లాజెన్, ఎలాస్టిన్​ ప్రొటీన్ల తయారీని పెంచుతుంది. దాంతో ముఖంలో వయసు కనపడదు. మాండెలిక్​ యాసిడ్​ అన్నిరకాల స్కిన్​లకు సరిపోతుంది. ఎండలో తిరగడం, వయసు పెరగడం వల్ల చర్మం రంగు మారకుండా చూస్తుంది. చర్మ రంధ్రాలు పెద్దవి కావడం, ముఖం మీద కురుపులు, ముడతలు, గీతలు వంటివి తగ్గిస్తుంది. చర్మంలోనికి చొచ్చుకెళ్లి, చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది. సీబం ఎక్కువ తయారు కాకుండా చేసి, చర్మ రంధ్రాల సైజ్​ పెరగకుండా చూస్తుంది. ఈ యాసిడ్​లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు యాక్నేని తగ్గిస్తాయి.