నియోజవర్గ సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నియోజవర్గ సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •     ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ 
  •     మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యా, ఉపాధి ఇరిగేషన్ లాంటి మౌలిక అంశాలతో సమగ్ర అభివృద్ధికి కార్యాచరణను అమలు చేస్తున్నట్లు ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రూ.40 కోట్లతో ఏర్పాటుచేసిన ఏటీసీను  రూ.6 కోట్లతో నిర్మించే ఐటీఐ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి ఏటీసీ విద్యార్థులతో మాట్లాడారు.  

రూ.8 కోట్లతో నిర్మించే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను రూ. 7 కోట్లతో నిర్మించే ఇరిగేషన్ భవన నిర్మాణ పనులను రూ.7.5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కాలేజీ, రూ.4.5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణాల పనులను పరిశీలించారు. 

అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నియోజకవర్గంలోని కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.1.71 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఏఎంసీ చైర్ పర్సన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, ఆర్ అండ్ బీ ఈఈ సీతారామయ్య, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం,  తహసీల్దార్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.