డబ్బులిస్తే తాగుతారని.. వేణుమాధవ్ రేషన్ సరుకులు కొనిచ్చేవాడు

డబ్బులిస్తే తాగుతారని.. వేణుమాధవ్ రేషన్ సరుకులు కొనిచ్చేవాడు

కమెడియన్ ఉత్తేజ్ సంతాపం

కమెడియన్ వేణుమాధవ్ ను చాలా మిస్సవుతున్నామని చెప్పారు తెలుగు సినీ ప్రముఖులు. ఉత్తేజ్ మాట్లాడుతూ.. ‘వేణుమాధవ్ మృతి చాలా బాధ కలిగిస్తోంది. 2,3 రోజులుగా రాజశేఖర్, జీవిత, ఆలీ, నేను ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాం. టాకింగ్ డాల్ బొమ్మ పట్టుకుని మిమిక్రీ చేసేటప్పటినుంచి వేణుమాధవ్ నాకు తెలుసు. చాలా మంచి మనిషి. చాలా మంచి స్నేహితుడు. ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న కమెడియన్స్ ఎవరో కనుక్కుని.. వారి లిస్టును నిర్మాతలకు ఇచ్చి.. తన క్యారెక్టర్ పక్కన ఏదైనా వేషం ఉంటే వారికి ఇప్పించేవాడు. ఇబ్బందుల్లో ఉన్నవారికి డబ్బులు ఇస్తే తాగడానికో.. మరేదానికో ఖర్చుచేస్తారని.. వారికి 2, 3 నెలలకు సరిపడా రేషన్ సరుకులు ఇచ్చే వ్యక్తి వేణుమాధవ్. బియ్యం, పప్పు ఉప్పు అన్నీ వారికి కార్లో పంపేవాడు. వేణుమాధవ్ పక్కన ఉంటే.. అక్కడ సందడి, సరదా ఉంటుంది” అని చెప్పారు.

రేపు మధ్యాహ్నం 1 నుంచి 2.30 వరకు ఫిలించాంబర్ లో వేణుమాధవ్ మృతదేహం ఉంచుతారని ఆలీ, ఉత్తేజ్ చెప్పారు. తర్వాత మౌలాలీలోని ఆయన ఇంటికి తీసుకెళ్తారు.