'వారసుడు' విడుదల వాయిదా

'వారసుడు' విడుదల వాయిదా

తమిళ సూపర్ స్టార్ విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'వారసుడు'. తమిళంలో 'వారిసు'గా వస్తోంది. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ ఈ నెల 12న రిలీజ్ కావాల్సివుండగా... ఇప్పడు విడుదల తేదీని వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. 'వారిసు' జనవరి 11న.. 'వారసుడు' జనవరి 14న గ్రాండ్ గి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ట్విట్లర్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధిన పోస్టర్ కూడా పోస్ట్ చేశారు.

ఇక ఇటీవలే ఈ మూవీ  ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు అకట్టుకునేలా ఉన్నాయి. థమన్‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ హైలేట్ గా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి,పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.