
మెగా హీరో వైష్ణవ తేజ్(Vaishnav tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aasi keshava). కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి(Sreekanth reddy) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ యాక్టర్ జోజు జార్జ్ (Joju George) విలన్ గా కనిపించబోతున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మిస్తున్న ఈ సినిమాకు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు రిలీజ్ కష్టాలు ఏర్పడ్డాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 18న ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఆగష్టులో వరుసగా పెద్ద సినిమాల రిలీజ్ ఉండడంతో ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. తాజాగా ఆదికేశవ సినిమాను నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు నెలల వెనక్కు వెళ్ళడానికి కారణం ఈ రెండు నెలల్లో వరుసగా భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ లో సలార్, స్కంద, ఖుషి,జవాన్.. అక్టోబర్ లో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి సినిమా రిలీజ్ కానున్నాయి. అందుకే ఆదికేశవ సినిమాను ఏకంగా రెండు నెలల వెనక్కి పోస్ట్ పోన్ చేశారు మేకర్స్.