
హాలియా, వెలుగు : జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చాలని వైశ్య వికాస వేదిక, వైశ్య రాజకీయ రణభేరి చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. ఆగస్టు 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హాలియాలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో వైశ్యులు సన్నాహక సమావేశం నిర్వహించారు. రణభేరి సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను స్థానిక వైశ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ ను పటిష్టంగా అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ తేవాలని, ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పోస్టుల్లో వైశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం వైశ్య రాజకీయ రణభేరి ‘మేమెంతో.. మాకంత’ అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తేలుకుంట్ల రాంబాబు, చీదళ్ల లింగయ్య, వెంపటి శ్రీనివాస్, వీరమల్ల కృష్ణయ్య, తేలపోలు శేఖర్, మంచుకొండ ప్రభాకర్, మిట్టపల్లి శ్రీనివాస్, పోలా శ్రీనివాస్, బచ్చు సతీశ్, చాణక్య, అట్టెం రవి, రామ్మోహన్, శ్రీనివాస్, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు యాదయ్య పాల్గొన్నారు.
రణభేరిని సక్సెస్ చేయాలి..
మేళ్లచెరువు/మఠంపల్లి,వెలుగు : ఆగస్టు 3న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వర్ రావు పిలుపునిచ్చారు. సోమవారం మేళ్లచెరువు, మఠంపల్లి మండల కేంద్రాల్లో వేర్వేరుగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టుల్లో జనాభా దామాషా ప్రకారం ఆర్యవైశులకు సీట్లు కేటాయించాలన్నారు.