వైశ్య రాజకీయ రణభేరి సభను సక్సెస్ చేయాలి : సత్యనారాయణ

వైశ్య రాజకీయ రణభేరి సభను సక్సెస్ చేయాలి : సత్యనారాయణ

నకిరేకల్, వెలుగు : ఆగస్టు 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే వైశ్య రాజకీయ రణభేరి సభను విజయవంతం చేయాలని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. బుధవారం నకిరేకల్ లోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రణభేరి సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల వాటా తేల్చాల్సిందేనన్నారు. ఈడబ్ల్యూఎస్ లో వర్గీకరణ తేవాలని చెప్పారు. వైశ్యులను గుడి, బడి వద్ద సేవా కార్యక్రమాలకు మాత్రమే వాడుకుంటున్నారే తప్ప, రాజకీయంలో సీట్లు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నామినేటెడ్ పదవుల్లో వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు వీరవెల్లి రఘునాథ్, టౌన్ సెక్రటరీ ఉప్పల సంతోష్,  వైశ్య వికాస వేదిక ముఖ్య సలహాదారుడు బుక్క ఈశ్వరయ్య, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, కోటగిరి దైవాదినం, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు సోమ యాదగిరి, మంచుకొండ సోమయ్య, మురారి శెట్టి కృష్ణమూర్తి,  గుండా వెంకటయ్య, ఉప్పల రమేశ్, వీర్లపాటి జానయ్య, కాళికామాత దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మదేవర రవిశంకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీశ్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ గుండా నరేందర్ తదితరులు పాల్గొన్నారు.