
పెద్దపల్లి: పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తరువాతే ఓట్లు అడుగుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు సన్నాహక సమావేశాన్ని పెద్దపల్లిలో నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీగావంశీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. రైతుల పక్షాన లోక్‌సభలో వంశీ మాట్లడుతారన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ కొప్పుల ఈశ్వర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఇక్కడి నీళ్లను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటే ఏం చేశావని ప్రశ్నిస్తూ ఈశ్వర్.. నీకు సోయిందా అంటూ ప్రశ్నించారు. కొత్త బిచ్చగాళ్లకు పొద్దు ఎరుగదు అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు చేన్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల పేర్లు చెప్పి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయార్నారు. కటింగ్ లేకుండా ధాన్యం కొంటామన్నారు. మానేరు నుంచి ఇసుక తీసేది లేదన్నారు.