దేశానికే ఆదర్శం వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ

దేశానికే ఆదర్శం వనపర్తి పాలిటెక్నిక్ కాలేజీ

వనపర్తి, వెలుగు: తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన వనపర్తి  ప్రభుత్వ పాలిటెక్నిక్  కాలేజీ దేశంలోనే ఆదర్శవంతమైందని, ఇక్కడ చదివిన విద్యార్థులు దేశవిదేశాల్లో ఇంజినీర్లుగా రాణించారని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్  కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాలేజీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజీలో చదివిన విద్యార్థులతో కాలేజీ గ్రౌండ్ నిండిపోయింది.

సమ్మేళనానికి హాజరైన కలెక్టర్​ తేజస్  నందలాల్  పవార్  మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు తరలి రావడంపై ఆనందం వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో వనపర్తిలో పాలిటెక్నిక్  కాలేజీ నెలకొల్పడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమన్నారు. తన స్నేహితుడు దురిశెట్టి అనుదీప్  తండ్రి దురిశెట్టి మనోహర్ కు ఈ కాలేజీతో ఎంతో అనుబంధం ఉందని కలెక్టర్  గుర్తు చేసుకున్నారు. అనంతరం పూర్వ విద్యార్థుల అసోసియేషన్  డైరీని ఆయన రిలీజ్​ చేశారు.