మదనాపురం, వెలుగు: వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గురువారం మదనాపురం మండలంలోని సరళా సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సైఫన్ల నుంచి దాదాపు 5,000 క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు.
ఊక చెట్టు వాగులోంచి రామన్ పాడు ప్రాజెక్టులోకి వరద చేరుతుండగా ప్రాజెక్టు గేట్లలో ఒక గేటును ఎత్తి కిందకు నీరు వదిలినట్లు ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ వద్ద తహసీల్దారు జేకే మోహన్, ఎస్ శేఖర్ రెడ్డి బందోబస్తు చేపట్టారు.
