స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక వందేమాతరం : కలెక్టర్ రాజర్షి షా

స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక వందేమాతరం : కలెక్టర్ రాజర్షి షా
  •     కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: వందేమాతర గీతం భారతీయతకు, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తికి ప్రతీక అని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్​ పట్టణంలోని అంబేద్కర్ చౌక్​లో డా.హెచ్. వి. వజే సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వందేమాతర గీతాపాలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యువత వికసిత్ భారత్ 2047, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. 

రాబోయే 25 ఏళ్లలో దేశంతో పాటు రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అగ్రగామిగా నిలవాలంటే నేటి విద్యార్థులే కీలకమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, ప్రజలతో కలిసి సామూహిక వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో వాజే సమితి సభ్యులు ప్రఫుల్ వాజే, దేవన్న, ప్రఫుల్ యాదవ్, జడ్పీ మాజీ చైర్మన్​సుహాసిని రెడ్డి, నాయకులు వేదా వ్యాస్, దేవిదాస్ దేశ్​పాండే పాల్గొన్నారు.