హ్యాపీడేస్ మూవీతో 18 ఏళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్(Varun Sandesh)..తర్వాత కెరీర్‌లో సక్సెస్‌లు అందుకోలేక పోయాడు. ప్రతి ఏడాది ఓ రెండేసి సినిమాలు చేస్తున్నప్పటికీ.. సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. గడిచిన రెండేళ్లలో వరుణ్ సందేశ్ సినిమాలు చూసుకుంటే.. మైఖేల్, ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు, నింద, వీరాజీ, రాచరికం, కానిస్టేబుల్ వచ్చాయి. అయితే, వీటిలో ఏ ఒక్కటీ కూడా ఊర్లలో ఉండే సగటు సినీ అభిమానులకు కూడా తెలియకుండానే వెళ్లిపోయాయి.
ఈ క్రమంలోనే ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకునే పనిలో పడ్డాడు. ఇపుడు సరిగ్గా థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ కథతోనే రానున్నాడు వరుణ్. అదే " నయనం" (Nayanam). బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ హీరోయిన్గా నటించింది. స్వాతి ప్రకాష్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also read:- మోగ్లీ వాయిదా.. నేనే దురదృష్ట వంతుడిని.. వెండి తెరకు నేనంటే ఎందుకింత ద్వేషం
ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. డిజిటల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సిరీస్ లో వరుణ్ సందేశ్ కంటి డాక్టర్ గా నటిస్తున్నాడు. ఇతరులు కళ్లద్దాల నుంచి నాలుగు నిమిషాల పాటు వాళ్లు చూసేది తాను చూడగలనని వరుణ్ క్యారెక్టర్ చెప్తుంది. అందుకోసం స్పెషల్గా ఓ కళ్లద్దాలు డిజైన్ చేస్తాడు. ఈ క్రమంలోనే ‘కళ్ల డాక్టర్ దగ్గర కళ్లకు కనిపించని సీక్రెట్స్ చాలానే ఉన్నాయి’ అనే డైలాగులు ఆసక్తిరేపుతున్నాయి.
నయనం కథ:
హీరోయిన్ కళ్లను చూసి డాక్టర్ వరుణ్ లవ్లో పడతాడు. ఈ క్రమంలోనే ఆమెకు భర్త ఉండనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత అతను హత్యకు గురవుతాడు. ఈ మర్డర్ ఎంక్వైరీ చేయడానికి పోలీస్ ఆఫీసర్గా అలీ రెజా రంగంలోకి దిగుతాడు. మరి ఈ మర్డర్ ఎలా జరిగింది? అతన్ని ఎవరు ఎందుకు చంపారు? వరుణ్ సందేశ్ అసలు రూపం ఏంటి? అతను దాచి ఉంచిన సీక్రెట్స్ ఎలా బయటపడ్డాయి? అనే తదితర విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే!!

