
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి లేటెస్ట్ గా ఫైనల్ ట్రైలర్ ను హీరో రామ్ చరణ్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్లో..వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల పర్యావరణం బాగా దెబ్బతింటుంది. ఇక ఆ కాలుష్యంకి సంబంధించిన ఒక నిజాన్ని..ఇండియన్ పర్యావరణ పరిరక్షణ మంత్రి(నాజర్) అంతర్జాతీయ సమ్మిట్ లో బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. దీంతో విలన్స్ ఆ మంత్రిని చంపడానికి ట్రై చేస్తుంటే..ఒక ప్రైవేట్ ఏజెన్సీలో పని చేసే హీరో ఆ మంత్రికి బాడీగార్డ్ గా వస్తాడు.
కొన్ని వేళ్ళ మంది చావులు వృధా కాకూడదు..ప్రపంచానికి నిజం తెలియాలి..అంటూ వరుణ్ తేజ్ చెప్పే ఇంటెన్సివ్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్, కారు చేజింగ్‍లతో వచ్చిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్ గా వరుణ్ నటించిన సీన్స్ గూస్బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక ఫస్ట్ రిలీజ్ అయినా ట్రైలర్ కూడా ఇదే రేంజ్లో ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ట్రైలర్ లో ఒక్కో సీన్స్ అండ్ ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టుగా మిక్కీ జే మేయర్(Micky j mayer) ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్లో అద్దిరిపోయింది.ఈ మూవీకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ మూవీకి రావడంతో పాటు..సినిమా రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉండేలా మేకర్స్ ప్రకటించారు.
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రియేటివ్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.ఇక ఈ మూవీలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్, మనీశ్ చౌదరీ, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబి వేద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్(SVCC) పై బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా..సాక్షి వైద్య(Sakshi vaidya) హీరోయిన్ గా నటిస్తోంది.