వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున..సెన్సారు కట్ పూర్తి..రన్ టైం ఎంతంటే?

వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున..సెన్సారు కట్ పూర్తి..రన్ టైం ఎంతంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) తెరకెక్కిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీన్స్, కారు చేజింగ్‍లతో వచ్చిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది.  ఇక ఈ మూవీ సెన్సారు కట్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్న నేపథ్యంలో..ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ మూవీకి రావడంతో పాటు..సినిమా రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉండేలా మేకర్స్ ప్రకటించారు. 

ఇప్పుడు వస్తోన్న ప్రతి మూవీస్ రన్ టైంతో పోల్చితే, గాండీవధారి అర్జున రన్ టైం తక్కువే అనుకోవాలి. కానీ ఇలా తక్కువ ఉండటమే గాండీవదారి అర్జునకి కలిసొచ్చే అంశమని అంటున్నారు సినీ క్రిటిక్స్. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో  కాన్సెప్ట్ ఉండటంతో..అనవసరమైన ల్యాగ్కి చోటు ఇవ్వకుండా కంటెంట్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఉంటారని తెలుస్తోంది. 

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో..అని నాజర్ చెప్పే డైలాగ్ మూవీకే హైలెట్ గా నిలిచేలా ఉంది. ట్రైలర్ లో ఒక్కో సీన్స్ అండ్ ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఆ సీన్స్ కు తగ్గట్టుగా మిక్కీ జే మేయర్(Micky j mayer) ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్లో అద్దిరిపోయింది.

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రియేటివ్ మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గాండీవధారి అర్జున చిత్రం ఉండనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీలో విమలా రామన్, వినయ్ రాయ్, రోషిణి ప్రకాశ్, మనీశ్ చౌదరీ, అభినవ్ గోమఠం, రవి వర్మ, కల్పలత, బేబి వేద కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్(SVCC) పై బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా..సాక్షి వైద్య(Sakshi vaidya) హీరోయిన్ గా నటిస్తోంది. 

గని సినిమాతో వరుణ్, ఘోస్ట్ సినిమాతో ప్రవీణ్ సత్తారు..ఫ్లాప్స్ తో ఉన్నారు.ఈ ఇద్దరికీ ఈ సినిమా చాలా స్పెషల్.అందుకే ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు దర్శకుడు, హీరో. మరి ఈ సినిమా ఈ ఇద్దరికీ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి మరి.