అనవసర అంశాలు యాడ్ అయ్యాయి.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది

అనవసర అంశాలు యాడ్ అయ్యాయి.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది

మెగా హీరో వరుణ్​ తేజ్(Varun tej)​ ఇటీవల నటించిన గని(Gani) సినిమా ఫ్లాప్​ జాబితాలో చేరింది. అయితే, ఈ సినిమా రిజల్ట్​ను ముందే ఊహించినట్టుగా వరుణ్​ తెలిపాడు. మంచి స్పోర్ట్స్​ డ్రామాగా అనుకున్న కథలో అన్ని వర్గాల వారిని మెప్పించేందుకు ప్రయత్నించాం. అనవసర అంశాలను యాడ్​ చేశాం.

అదే మేం చేసిన తప్పు. రిలీజ్​కు ముందే మూవీ చూస్తున్నప్పుడు అది నాకు తెలిసిపోయింది. కానీ, ఎక్కడో చిన్న హోప్​ ఉండేది. పరాజయాల నుంచి నేర్చుకుని ముందుకెళ్లడం నేర్చుకున్నా. గతంలో మిస్టర్(Mistar)​ ఫ్లాప్​ తర్వాత తొలిప్రేమ వంటి హిట్స్​ ఇచ్చాను. గని రిజల్ట్​తో మళ్లీ ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటాను అని వరుణ్​ తేజ్​ వెల్లడించాడు.