ఇల్లు కట్టేటప్పుడు అందరు కచ్చితంగా వాస్తు పండితుడిని సంప్రదిస్తారు. ఎంత మూఢ నమ్మకమున్నా.. అంతో .. ఇంతో తప్పనిసరిగా అనుసరిస్తారు. అయితే ఇంటి నిర్మాణంలో యజమాని పేరు ఆధారంగా వాస్తు చూడాలా.. లేదా జన్మరాశి. నక్షత్రం బట్టి చూడాలా.. అలాగే ఇంటిస్థలానికి మూడు వైపులా రోడ్డు ఉంటే నష్టాలొస్తాయా.. .మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: పేరునుబట్టి వాస్తు ఉంటుందా? జన్నరాశి, నక్షత్రాలను బట్టి వాస్తు చూపించుకోవాలా? అందరికీ ఒకే వాస్తు వర్తిస్తుందా?
జవాబు: జాతకం వేరు, వాస్తు వేరు. అయితే పేరు. నక్షత్రాలను బట్టి ఎవరికి ఎలాంటి ఫేసింగ్ ఉన్న ప్లాట్స్ సరిపోతాయో చెప్పాచ్చు. వాస్తు చూపించుకునే ముందు ఇంటి లేదా స్థల యజమాని పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రశ్న: ఇంటి స్థలానికి మూడు వైపులా వీధులు ఉంటే ఏమైనా వాస్తు దోషం ఉంటుందా?
జవాబు: ఇంటి చుట్టూ ఎన్ని వీధులు ఉన్నాఇళ్లు కట్టుకుంటే తప్పులేదు. అయితే రోడ్లు ఏవైపు ఉన్నాయి? ఎటు వైపు ఫేసింగ్ లో ఇల్లు కట్టుకోవాలి? అనేది అన్ని దిక్కులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.
