మజిలీ రీమేక్కు రికార్డు కలెక్షన్లు

మజిలీ రీమేక్కు రికార్డు కలెక్షన్లు

నాగచైతన్య, సమంత మెయిన్ లీడ్గా శివ నిర్వాణ తెరకెక్కించిన మూవీ మజిలీ. ఈ చిత్రాన్ని మరాఠీలో వేద్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీలో నిజజీవితంలో భార్యభర్తలైన రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా నటించిన ఈ మూవీ మరాఠీలో రికార్డు  స్థాయి కలెక్షన్లను సాధిస్తోంది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఇప్పటివరకు రూ.44.92 కోట్ల వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్‌ తన ట్వీట్ లో తెలిపాడు. 

మరాఠీలో సైరాట్ (రూ.110 కోట్లు) తరువాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా  వేద్  నిలిచింది.  వేద్ చిత్రానికి రితేశ్‌ దేశ్‌ముఖ్‌ స్వీయదర్శకత్వం వహించగా పదేళ్ల తరువాత జెనీలియా సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇచ్చింది. న్యూ ఇయర్  కానుకగా డిసెంబరు 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫస్ట్ డే రూ.3.5కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. 15రోజుల్లో ఈ మూవీ రూ.44.92కోట్లు రాబట్టింది.