స్టేట్‌ ర్యాంకింగ్‌ పికిల్‌బాల్ విన్నర్స్‌ వేదాన్ష్‌, విశ్వ

స్టేట్‌ ర్యాంకింగ్‌  పికిల్‌బాల్  విన్నర్స్‌ వేదాన్ష్‌, విశ్వ

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్‌ (టీపీఏ) నిర్వహించిన మొదటి స్టేట్‌ లెవెల్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లో  వేదాన్ష్, విశ్వ విజేతలుగా నిలిచారు.  సోమవారం జరిగిన  అండర్‌‌12 బాయ్స్ ఫైనల్లో వేదాన్ష్ 15–-11తో రిషాన్ పై నెగ్గాడు. అండర్‌‌14 ఫైనల్లో విశ్వ 15–3తో ధనవంత్‌ను ఓడించాడు.   పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆదిరాజ్‌ 15--–13తో రామచంద్ర కిరణ్‌పై , విమెన్స్  సింగిల్స్‌ తుదిపోరులో  ప్రీతి రెడ్డి 11--–5తో వాసవి రెడ్డిపై గెలిచి  టైటిళ్లు గెలుచుకున్నారు. 

ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులందరూ  బెంగళూరులో జరగబోయే   నేషనల్ లెవెల్‌ చాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించారని టీపీఏ సెక్రటరీ, టెన్నిస్ ఒలింపియన్ విష్ణువర్ధన్ తెలిపాడు.  విన్నర్లకు మెడల్స్ అందజేశాడు.