బాలయ్య బాబు వీరసింహారెడ్డి..సక్సెస్ ఫుల్ గా 200 డేస్ కంప్లీట్

బాలయ్య బాబు వీరసింహారెడ్డి..సక్సెస్ ఫుల్ గా 200 డేస్ కంప్లీట్

డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ (Balakrishna) నటించిన యాక్షన్ ఫిల్మ్ వీరసింహారెడ్డి. లేటెస్ట్ గా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ కర్నూలు(D) ఆలూరు లోని SLNS థియేటర్‌లో డైలీ 4 షోలతో 200 రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీచంద్ ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేశారు. దీంతో ఈ మధ్య కాలంలో ఇన్ని రోజులు థియేటర్ లో సినిమా ఆడటం.. చాలా గొప్ప విషయం అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. 

ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో మూవీ లెజెండ్  కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్‌లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. 

వీరసింహారెడ్డి మూవీ ఈ ఏడాది 2023 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ ఏప్రిల్ 21తో 100 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసేందే. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శ్రుతిహాసన్, హానీరోజ్ నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ పోషించింది. థమన్ అందించిన మ్యూజిక్ ఈ మూవీ సక్సెస్ లో కీలకంగా నిలిచింది.