లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ

 లోక్‌సభ ఎన్నికల్లో వీరప్పన్ కూతురు పోటీ

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించి పేరుమోసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి  లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.  వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యారాణి  2020 జూలైలో బీజేపీలో చేరారు.  రాష్ట్ర యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 

ఇటీవలే  నటుడు-దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని తమిళ జాతీయవాద పార్టీ (NTK)లో చేరారు.  ఆ పార్టీ ఆమెకు ఎంపీ టికెట్ ను కేటాయించింది.   కృష్ణగిరి పార్లమెంట్ స్థానం నుంచి విద్యారాణి  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా రాణి కృష్ణగిరిలో పాఠశాలను నడుపుతోంది. 

తమిళ జాతీయవాద పార్టీ మెల్లిమెల్లిగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 1.1 శాతం ఓట్లు గెలుచుకున్న ఆ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 4 శాతం ఓట్లను సాధించింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 6.7 శాతం ఓట్లు సాధించి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది