మహిళల టీ-20 ఛాలెంజ్-2022లో వెలాసిటీ బోణి

మహిళల టీ-20 ఛాలెంజ్-2022లో వెలాసిటీ బోణి

మహిళల టీ-20 ఛాలెంజ్-2022లో వెలాసిటీ బోణి కొట్టింది. హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని సూపర్‌ నోవాస్‌పై వెలాసిటీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్..20 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓ దశలో 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ ఆదుకుంది. 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 రన్స్ సాధించింది.  ఈమెకు తానియా బాటియా 36 పరుగులు, సునే లూస్ 20 పరుగులతో సహకారం అందించారు. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్ రెండు వికెట్లు తీసుకోగా, దీప్తి శర్మ, రాధా యాదవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 151 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెలాసిటీ..షఫాలీ  వర్మ, లారా వోల్వార్డ్ట్ హాఫ్ సెంచరీలు సాధించడంతో 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సూపర్ నోవాస్ బౌలర్లలో డియాండ్రా డాటిన్,పూజా చెరో వికెట్ పడగొట్టారు.