పౌష్టికాహారం అందించాలనే సీఎం బ్రేక్​ ఫాస్ట్​: వేముల ప్రశాంత్ రెడ్డి

పౌష్టికాహారం అందించాలనే సీఎం బ్రేక్​ ఫాస్ట్​:  వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్, వెలుగు :  సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో మానవీయ పథకాలను ప్రవేశాపెడుతున్నారని ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లో శుక్రవారం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు 200 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే ఆ సంఖ్యను సీఎం కేసీఆర్ 1000 పైగా చేశారని చెప్పారు.

పేదవారు కూడా ప్రపంచంతో పోటీ పడేలా మంచి విద్యను అభ్యసించాలని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్​ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేశామన్నారు. ఊరు మన బడిలో భాగంగా పలు స్కూళ్లను బాగుచేసుకొని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలాగే స్టూడెంట్స్​కు పౌష్టికాహారం అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.  

తానూ ఇదే స్కూల్‌లో  చదువుకున్నానని, నేడు మంత్రి హోదాలో ఇక్కడే సీఎం బ్రేక్ ఫాస్ట్  కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వేల్పూర్ స్కూల్​లో 640 మంది విద్యార్థులకు , నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మంది స్టూడెంట్స్​కు సీఎం బ్రేక్ ఫాస్ట్ అందనుందని చెప్పారు. అనంతరం విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. 

పలు స్కూళ్లలో... 

నిజామాబాద్/కామారెడ్డి/ఆర్మూర్/బాన్సువాడ/మాక్లూర్, వెలుగు : జిల్లాలోని ఆయా స్కూళ్లలో పలువురు అధికారులు, లీడర్లు సీఎం బ్రేక్​ ఫాస్ట్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటలోని స్కూల్​లో  స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి,  కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని దేవునిపల్లి హైస్కూల్​లో విప్​ గంప గోవర్ధన్​,  పిట్లం మండలం బోయవాడలోని  స్కూల్​లో  ఎమ్మెల్యే హన్మంతుషిండే, జడ్పీ చైర్​పర్పన్​దఫేదర్​ శోభ,  కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​,  

రామారెడ్డి మండలం ఇసన్నపల్లిలో  ఎమ్మెల్యే  జాజాల సురేంధర్, ఆర్మూర్ టౌన్ లోని  రాంమందిర్ హైస్కూల్ లో ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి,  నిజామాబాద్​లో కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు మాట్లాడారు. ముందు చూపుతో ప్రవేశ పెట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం స్టూడెంట్స్ కు వరమన్నారు.