
వేములవాడ, వెలుగు:వేములవాడ ఏరియా హాస్పిటల్‌లో 24 గంటల్లో వివిధ రకాల 20 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేసినట్లు హాస్పిటల్సూపరింటెండెంట్ పెంచలయ్య బుధవారం తెలిపారు. ఇందులో సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు ద్వారా 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2 , ఆర్థో ఆపరేషన్ ఒకటి ఉన్నాయి.
ఆపరేషన్లు నిర్వహించిన గైనకాలజిస్ట్‌లు సంధ్య, సోనీ, మాధవి, పీడీయాట్రిషియన్లు సుభాషిణి, చారి, రమణ, ఆర్థోపెడిక్ అనిల్, మత్తు డాక్టర్లు రాజశ్రీ, తిరుపతి, రవీందర్, కంటి డాక్టర్లు రత్నమాల, నర్సింగ్ ఆఫీసర్స్ ఝాన్సీ, జ్యోతి,అనసూయ, బ్లోసమ్, సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు.